: నిర్ణయం మీదే అంటోన్న సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు మెదక్ జిల్లా సంగారెడ్డిలో 'అమ్మహస్తం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మొసలి కన్నీళ్ళు కారుస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో బీసీలకు ఏడాదికి రూ. 158 కోట్లు కేటాయిస్తే, కాంగ్రెస్ సర్కారు ఏడాదికి రూ. 4 వేల 27 కోట్లు బీసీల అభివృద్ధి కొరకు కేటాయిస్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఎవరు బీసీలపై ప్రేమ చూపించారో మీరే నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన సభికులకు సూచించారు.