: 'కిమ్ దోపిడీ కట్టుకథే' అంటున్న వెబ్ సైట్... పరువు నష్టం దావావేసిన నటి
గత నెల 3వ తేదీన పారిస్ లోని ఓ హోటల్ లో సెలబ్రిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ పై జరిగిన దోపిడీ ఓ కట్టుకథని, అదంతా బీమా సొమ్ము కాజేసేందుకు ఆడిన నాటకమని 'మీడియా టేక్ అవుట్ డాట్ కామ్' అనే వెబ్ సైట్ రాసిన కథనంపై కిమ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో పరువునష్టం దావా వేసింది. తనపై దాడిని వక్రీకరిస్తూ, అసత్యాలు ప్రచురించిందని ఆరోపించింది. తన నాటకంతో కిమ్, అందరినీ బోల్తా కొట్టించిందని వెబ్ సైట్ తీవ్ర ఆరోపణలు చేయగా, కిమ్ వాటిని ఖండించింది. దోపిడీకి గురైన నగలకు బీమా ఉండటంతో, వాటి విలువను చెల్లించాలని ఆమె క్లయిమ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, దోపిడీ తరువాత ఆమె వ్యాఖ్యాతగా ఉన్న 'కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్' కార్యక్రమం నిలిచిపోగా, ఆమె సామాజిక మాధ్యమాల్లో, టీవీ షోల్లో పాల్గొనడాన్ని తాత్కాలికంగా ఆపేసింది.