: గతంలో జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్‌ను మేం వెల్లడించలేదు: మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్
నియంత్రణ రేఖను దాటి భారతసైన్యం ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో చేసిన లక్షిత దాడుల అంశంపై యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన శివశంకర్ మీనన్ స్పందించారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... గతంలో కూడా సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయని చెప్పారు. అయితే, అప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్‌ను తాము వెల్లడించలేదని అన్నారు. అప్పట్లో తాము నిర్వహించిన లక్షిత దాడుల లక్ష్యం వేరని పేర్కొన్నారు. భారత సైన్యం జరిపే దాడుల లక్ష్యం దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు జరగకుండా నిరోధించడమేనని ఆయన అన్నారు. అంతేగాని, దేశంలో ప్రజల మనోభావాలను మేనేజ్ చేయడం కాదని పేర్కొన్నారు.