: నైరుతిలో మానేరు, పడమర మధ్యమానేరు... కరీంనగర్ కు అరిష్టమంటున్న పండితుడు!


జిల్లాల పునర్విభజన తరువాత అవశేష కరీంనగర్ జిల్లాకు తీవ్ర వాస్తు దోషం ఏర్పడిందని పండితులు చెబుతున్నారు. ఈ మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను కలిసిన వాస్తు పండితుడు నమిలకొంత రమణాచార్య స్వామి, జిల్లా ముందున్న వాస్తు సమస్యను తెలిపారట. గతంలో వాస్తు బాగున్నందునే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని, ఇప్పుడు నైరుతిలో మానేరు జలాశయం, పడమర మిడ్ మానేరు జలాశయాలు రావడం దోషమని, ఉత్తర, ఈశాన్యాన భూమి కోత పడటం, తూర్పు, దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాలు పెరగడం మంచిది కాదని చెప్పుకొచ్చారట. దీనివల్ల ఎంతో అనర్థమని, అరిష్టాలు జరగవచ్చని హెచ్చరించిన రమణాచార్య, దోష నివారణకు నైరుతి దిక్కున 100 అడుగుల ఎత్తయిన అష్ట దిక్పాలక వాస్తు స్థూపం నిర్మించాలని చెప్పారట. ఎమ్మెల్యే గంగుల సైతం దీనికి సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News