: రాంసాన్ పల్లిలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి... రెండు ట్రాక్టర్లలో వచ్చి మృతురాలి భర్త ఇంటిపై దాడికి దిగిన ఆమె బంధువులు

సంగారెడ్డిలోని ఆందోల్ మండలం రాంసాన్ పల్లిలో ఈరోజు ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ఆ ప్రాంతంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న మృతురాలి బంధువులు ఆమె మృతికి భర్తే కారణమని ఆరోపిస్తూ.. రెండు ట్రాక్టర్లలో రాంసాన్ పల్లికి చేరుకొని ఆమె భర్త ఇంటిపై దాడికి దిగారు. దాడిలో మృతురాలి భర్త తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, పోలీసులపై కూడా వారు దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో వారి దాడిలో ఓ హోంగార్డుకు గాయాలయ్యాయి. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు ఎట్టకేలకు చెదరగొట్టారు.