: రామగుండం ఎన్టీపీసీ ముందు ఆందోళనకు దిగిన మూడు వేల మంది కార్మికులు
కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం ఎన్టీపీసీ ముందు ఈరోజు ఉదయం కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇటీవలే ఎన్టీపీసీలో అధికారులు 11 మంది ఒప్పంద కార్మికులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో విధులు బహిష్కరించిన మూడు వేల మంది ఒప్పంద కార్మికులు నిరసన తెలుపుతున్నారు. సస్పెండ్ చేసిన ఒప్పంద కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన విరమించబోమని తేల్చిచెబుతున్నారు.