: ట్రంప్ కు ఇప్పుడు నాలుగో భార్య... అంతా తాత్కాలిక ఆనందమే: చంద్రబాబు


ఈ ఉదయం అమరావతిలో సీఎం చాంబర్ ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వేళ, చంద్రబాబునాయుడు రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ సతీమణి మెలానియాను ప్రస్తావించారు. భారతీయ కుటుంబ విలువల గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బంధం, బంధుత్వాలు ఇండియాలో కొనసాగుతున్నాయని అన్నారు. అమెరికాలో ఒక్కొక్కరు ఎన్నో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ట్రంప్ కు ఇప్పుడు నాలుగో భార్య అనుకుంటానని అన్నారు. ఇన్నేసి పెళ్లిళ్లు చేసుకోవడం తాత్కాలిక ఆనందం కోసమేనని అన్నారు. ఇండియాలో కుటుంబ బంధమే అమితానందాన్ని అందిస్తోందని అన్నారు. కేవలం 8 నెలల స్వల్ప వ్యవధిలో సచివాలయాన్ని నిర్మించి చూపామని గుర్తు చేసిన ఆయన, వరదలు ఏ ప్రాంతంలోనైనా వస్తాయని అన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లనూ వరదలు చుట్టుముట్టాయని, వరదలను ఎవరూ ఊహించలేమని అన్నారు.

  • Loading...

More Telugu News