: ‘పురుగుల’తో కేకు తయారు చేస్తోన్న బేకరీ... ప్రొటీన్లు అధికంగా ఉంటాయట!


పురుగుల్ని చూస్తేనే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. అటువంటిది పురుగులతో కేక్ తయారు చేస్తున్నారన్న మాట వింటేనే జుగుప్స కలుగుతుంది కదూ? అయితే అక్కడ వాటిని లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. స్కాట్ లాండులోని ఎడిన్‌బర్గ్‌లోని 'పాటిసెరీ మాక్సీమ్‌' అనే బేకరీలో ప్రొటీన్ల కోసం తేళ్లు, పురుగులతో కేకులు తయారుచేస్తున్నారు. శరీరానికి ప్రొటీన్లు అవసరమయ్యే వారు ఈ కేకు తీసుకుంటే కావాల్సిన‌ మోతాదులో శరీరానికి ప్రొటీన్లు అందుతాయని కేకు త‌యారీదారులు చెబుతున్నారు. ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో ఈ కేకుల్ని తయారుచేస్తున్నారు. జనాలు కూడా మహా ఇష్టంగా తినేస్తున్నారు లెండి!

  • Loading...

More Telugu News