: పాతబస్తీలో 2,500 మంది పోలీసులు, 2 కంపెనీల కేంద్ర బలగాలతో భారీ భద్రత
మొహర్రం పండుగ నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికోసం, 2,500 మంది పోలీసులతో పాటు 2 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. 10 షీ టీమ్స్ తో పాటు, ఐదు బాంబు స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగాయి. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. పరిస్థితిని నగర కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు.