: సంతాన, ఉద్యోగ, విదేశీ రొట్టెలకు భలే డిమాండ్!


నెల్లూరులో రొట్టెల పండగ తారస్థాయికి చేరుకుంది. మొత్తం ఐదు రోజుల పాటు సాగే పర్వదినాల్లో నేడు, రేపు అత్యంత కీలకం కాగా, స్వర్ణాల చెరువు నుంచి పొదలకూరు నుంచి దర్గాకు వెళ్లే మార్గం వరకూ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే దాదాపు 6 లక్షల మందికి పైగా భక్తులు బారా షాహీద్ దర్గాను దర్శించుకుని అమరులకు నివాళులు తెలుపగా, ఈ రెండు రోజుల్లో మరో 5 లక్షల మంది వస్తారని అంచనా. ఇక రొట్టెల మార్పిడిలో భాగంగా సంతాన రొట్టె, విదేశీ రొట్టెకు డిమాండ్ అధికంగా ఉంది. తాము కోరుకున్న కోరికలు తీరిన భక్తులు, ఇక్కడికి అదే కోరికలు కోరేందుకు వచ్చే వారికి తమ రొట్టెలను ఇవ్వడం ఆనవాయతీగా వస్తోంది. వ్యాపార, సంతాన, ఆరోగ్య, ఉద్యోగ, విద్య, పెళ్లి, సౌభాగ్య తదితర సంప్రదాయ రొట్టెలతో పాటు వీసా రొట్టెలు, విదేశీ ప్రయాణ రొట్టెలు, ప్రజా ప్రతినిధులు తమకు ప్రచారం కోసం టెంట్లు, గుడారాలు వేసి మరీ పంచుతుండే అభివృద్ధి రొట్టెలు ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. సంతానంతో పాటు ఉద్యోగం, విదేశీ రొట్టెలకు ఈ సంవత్సరం డిమాండ్ అధికంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News