: మూడు రోజుల్లో భారీగా 'పెట్రో' వడ్డన!


అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గణనీయంగా పెరగడంతో మరో మూడు రోజుల్లో ఓఎంసీలు (ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు) భారీగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెలా 15, 30 తేదీల్లో పెట్రో ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ఓఎంసీలు, ఈ సంవత్సరంలో క్రూడాయిల్ ధరలు గరిష్ఠస్థాయిని తాకిన వేళ, పెంపు భారీగా ఉండవచ్చని తెలుస్తోంది. ఉత్పత్తిని తగ్గించేందుకు అల్జీరియా అంగీకరించడం, తామూ అదే దారిలో నడుస్తామని నాన్ ఒపెక్ దేశాల నుంచి వచ్చిన సంకేతాలు, సౌదీ అరేబియా సైతం ప్రొడక్షన్ తగ్గించాలని తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో క్రూడాయిల్ ధర బ్యారల్ కు 53.45 డాలర్లను తాకింది. వాస్తవానికి గత రెండేళ్లుగా చమురు ఉత్పత్తి దేశాలు ప్రొడక్షన్ ను తగ్గించేందుకు ఎంతమాత్రమూ అంగీకరించని వేళ, ధరలు పన్నెండేళ్ల కనిష్ఠానికి జారిపోయాయి. ఒకదశలో క్రూడాయిల్ ధర 30 డాలర్ల దిగువకు కూడా వచ్చింది. పడుతూ లేస్తూ సాగుతున్న చమురు ధరలు గత నెలలో ఒపెక్, నాన్ ఒపెక్ దేశాలకు మధ్య జరిగిన డీల్ తో ఒక్కసారిగా 15 శాతం పెరిగాయి. ముడిచమురు ధరలు ఈ స్థాయిలోనే కొనసాగితే, భవిష్యత్తులో ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉండదని ఇస్తాంబుల్ లో జరిగిన వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ లో నిపుణులు హెచ్చరించడంతో ధరలు పెరిగేందుకు సహకరించాలని అన్ని దేశాలూ ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు శరవేగంగా పెరుగుతూ ఉండటంతో దాని ప్రభావం భారతీయులపైనా పడనుంది.

  • Loading...

More Telugu News