: మోనికాకు ఆ వీడియోలు చూపించి, రేప్ చేశాడు


ప్రముఖ పర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్య కేసులో అసలు నిజాలు వెలుగు చూశాయి. నిందితుడు రాజ్ కుమార్ సింగ్ ఆమెకు బలవంతంగా మూడు పోర్న్ వీడియోలు చూపించి, ఆ తర్వాత అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశాడు. ఈ వివరాలను గోవా పోలీసులు వెల్లడించారు. ఇది అనుకోకుండా జరిగిన హత్య కాదని... ముందుగానే ప్లాన్ వేసి చేసిన హత్య అని గోవా డీఐజీ విమల్ గుప్తా తెలిపారు. హత్య జరిగిన నాడు ఏం జరిగిందో డీఐజీ మాటల్లోనే విందాం. "సెక్యూరిటీ సూపర్ వైజర్ అంటూ అక్కడకు వచ్చిన రాజ్ కుమార్ సింగ్ మోనికా ఉంటున్న ఇంటి తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగానే కత్తితో బెదిరించాడు. దాంతో ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించింది. ఈ లోగానే ఆమె నోరు నొక్కేసి, బాత్రూంలోకి లాక్కెళ్లాడు. ఈ ఘటనతో భయపడిపోయిన ఆమె సగం స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను మంచం మీద పడుకోబెట్టి, చేతులు, కాళ్లు కట్టేశాడు. తీవ్ర భయాందోళనకు గురైన ఆమె ఏమీ చేయలేదని నిర్ధారించుకున్న తర్వాత... డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. తన పర్సులో రూ. 4 వేలు ఉన్నాయని... వాటిని తీసుకొమ్మని మోనికా చెప్పింది. ఆ డబ్బు చాలదని రాజ్ కుమార్ చెప్పడంతో... తన ఏటీఎం తీసుకొమ్మని చెప్పి, పిన్ నెంబర్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆమె మొబైల్ తీసుకుని... దాని పాస్ వర్డ్ అడిగాడు. ఫోన్ ఓపెన్ చేసి, మూడు పోర్న్ వీడియోలను ఆమెకు బలవంతంగా చూపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. మోనికాకు తాను బాగా తెలుసు కాబట్టి, ఆమె తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న అనుమానంతో, ఆమె గొంతు పిసికి, ఆ తర్వాత దిండుతో ఆమె ముఖం మీద కూడా నొక్కి ఆమెను హతమార్చాడని డీఐజీ తెలిపారు. జూన్ 7వ తేదీన ఈ అపార్ట్ మెంటులో ఏమైనా ఖాళీ ఫ్లాట్స్ ఉన్నాయా? అని అడిగేందుకు మొదటిసారి మోనికా అక్కడకు వచ్చింది. ఆమెకు వివరాలు చెప్పే సమయంలోనే రాజ్ కుమార్ ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని డీఐజీ వెల్లడించారు. అప్పటి నుంచి ఆమెను జాగ్రత్తగా గమనించిన నిందితుడు... మోనికా ఒక్కతే ఉంటోందని గ్రహించాడు. తన కారును కడిగేందుకు రాజ్ కుమార్ ను మోనికా నియమించుకున్నప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం ఎక్కువ చేశాడు. ఆ తర్వాత పని విషయంలో మోనికా సహా ఇతరుల నుంచి కూడా రాజ్ పై ఫిర్యాదులు రావడంతో... అతడిని ఉద్యోగం నుంచి పీకేశారు. అంతేకాదు, రెండు నెలల జీతం కూడా ఆగిపోయింది. దీంతో, మోనికాపై అతడు కక్ష పెంచుకున్నాడు. దీనికితోడు, ఆమెపై వ్యామోహం కూడా ఉండటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

  • Loading...

More Telugu News