: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. శాస్త్రోక్తంగా కార్యాలయంలోకి అడుగిడిన ముఖ్యమంత్రి!


ఇక నుంచి అమరావతి కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కార్యకలాపాలు కొనసాగనున్నాయి. వెలగపూడిలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)ను చంద్రబాబు ప్రారంభించారు. ముందుగా నిర్ణయించిన 8:09 గంటల ముహూర్తానికి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుమ్మడికాయ కొట్టి చాంబర్‌లోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, సీఎస్ టక్కర్, డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News