: తిరుమల శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
తిరుమల శ్రీవారి పాదాల దగ్గరున్న అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా అటవీ ప్రాంతం నుంచి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం తెలియరాలేదు.