: పాక్ ఆర్మీ పోస్టులపై రెడ్ ఫ్లాగ్స్.. భారత బలగాలు అప్రమత్తం


పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత దళాలు చేసిన మెరుపు దాడుల తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇవి చల్లారకపోగా మరింత ఉద్రిక్తంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్‌వోసీ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ పోస్టులపై రెడ్ ఫ్లాగ్స్ దర్శనమిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే కాల్పులకు పాల్పడవచ్చనేది ఈ ఎర్రజెండాల అర్థం. పాక్ ఎర్ర జెండాలను గుర్తించిన భారత దళాలు అప్రమత్తమయ్యాయి. పాక్ ఆర్మీ కంటపడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే జావాన్లకు హెచ్చరికలు అందాయి. పాక్ చర్యలకు ప్రతిగా అన్నట్టు భారత్ ఆర్మీ ఔట్ పోస్టులపైనా రెడ్ ఫ్లాగ్స్ ఎగరవేశారు.

  • Loading...

More Telugu News