: దేవరగట్టులో మళ్లీ చిందిన రక్తం.. కర్రల సమరంలో 40 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం


దేవరగట్టులో మళ్లీ తలలు పగిలాయి. దేవుడిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి దేవాలయానికి చేరుకున్న మూడు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు దిగారు. ఇనుప చువ్వలున్న కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు. పోలీసు బలగాలను భారీగా మోహరించినా హింసను మాత్రం ఆపలేకపోయారు. దశాబ్దాలుగా ఆచారం పేరుతో కొనసాగుతున్న ఈ కర్రల సమరంలో నిన్న రాత్రి మొత్తం 40 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో ప్రతీ ఏటా ఆచారం పేరుతో కర్రల సమరాన్ని నిర్వహిస్తున్నారు. మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఉత్సవం నిర్వహిస్తారు. దేవుడిని దర్శించుకునేందుకు 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు. కర్రల సమరాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కర్రల సమరంలో 40 మంది గాయపడగా కాగడాలు అంటుకుని మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News