: నేవల్ డాక్ యార్డ్ లో విషాదం... తుపాకి మిస్ ఫైర్.. లెఫ్టినెంట్ మృతి
విశాఖపట్టణంలోని నేవల్ డాక్ యార్డ్ లో విషాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ కుఠార్ యుద్ధనౌకలో తుపాకులు శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ తేజ్ వీర్ సింగ్ తుపాకీ తూటాతగిలి అక్కడికక్కడ మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసిన నేవల్ పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.