: ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే పాకిస్థాన్ తో జాగ్రత్త: రష్యాను హెచ్చరించిన భారత్


రష్యాకు భారత్ హెచ్చరికలు జారీ చేసింది. పాములాంటి పాకిస్థాన్‌ తో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పాకిస్థాన్‌ తో సైనిక సహకారం అంటే కోరి సమస్యలు కొనితెచ్చుకోవడమే అవుతుందని భారత్ అభిప్రాయపడింది. ఉగ్రవాదానికి ప్రధాన స్పాన్సరర్ అయిన పాకిస్థాన్‌ తో సైనిక సహకారంపై పునరాలోచించుకోవాలని రష్యాకు తెలియజేశామని రష్యాలో భారత రాయబారి పంకజ్ శరన్ తెలిపారు. ఈ సైనిక సహకారం భవిష్యత్తులో సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాక్-రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన రష్యాను హెచ్చరించారు. భారత్-రష్యాలు చిరకాల మిత్రులన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రష్యా-పాక్ ల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తమ రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతోనే తానీ హెచ్చరికలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో యూరీ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను రష్యా కొనియాడిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నామని చెప్పిన ఆయన, భవిష్యత్తులోనూ తమ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News