: ప్రధాని ఇంతవరకు సెలవులు తీసుకోలేదు: వెల్లడించిన పీఎంవో
ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని పీఎంవో తెలిపింది. ప్రధాని మోదీ సెలవుల నిబంధనలు, వాటి విధానాలతో పాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయ్, హెచ్ డీ దేవెగౌడ, ఐ.కె గుజ్రాల్, పీవీ నరసింహారావు, చంద్రశేఖర్, వీపీ సింగ్, రాజీవ్ గాంధీలు తీసుకున్న సెలవుల వివరాలు తెలియజేయాలంటూ ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ఎప్పుడూ డ్యూటీలోనే ఉన్నారని తెలిపారు. ఆయన పేరు మీద ఇప్పటివరకు సెలవు రికార్డులు లేవని వెల్లడించారు. సెలవులు తీసుకోని ప్రధాని సమయపాలనలో కూడా కచ్చితంగా ఉంటారని తెలిపారు. విదేశాలకు ప్రయాణించేటపుడు సమయం వృథా కాకుండా ఉండేందుకు మోదీ రాత్రివేళ విమానంలోనే నిద్రపోతారని గతంలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.