: కార్లో వచ్చి డబ్బు సంచులు రోడ్డుపక్కన పడేశారు!


తమిళనాడులో రోడ్డు పక్కన డబ్బు సంచులు పడేసిన ఘటన కలకలం రేపింది. కడలూరు జిల్లా కుచిపాలయం గ్రామంలో ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు నాలుగు సంచులను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. దీనిని గమనించిన స్థానికులు ఆ నాలుగు మూటలను విప్పి చూడగా వాటిలో చిరిగిన కరెన్సీ నోట్ల కట్టలు కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ డబ్బుల సంచులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పడేసి వెళ్లిపోయిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ నోట్ల కట్టలు దొంగ నోట్లా? లేక చలామణిలో ఉన్నవా? అన్నది నిర్ధారించేందుకు బ్యాంకుకు పంపించారు.

  • Loading...

More Telugu News