: దేవరగట్టులో ఉత్సవానికి సర్వం సిద్ధం...భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు!
కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. మాల మల్లేశ్వరస్వామి ఉత్సవం ఘనంగా నిర్వహించేందుకు స్థానికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయగా, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. దేవరగట్టులో నిర్వహించే రాక్షస క్రీడను ఆపేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బన్నీ ఉత్సవం ఎలా జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక వైద్యాధికారులను కేటాయించారు. పండగను పురస్కరించుకుని 20 పడకల సామర్థ్యంతో ప్రత్యేకంగా ఓ తాత్కాలిక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు.