: ఎంతిచ్చినా తృప్తి ఉండదంటారాయన...ఎంతిచ్చినా చాలదంటాను నేను: చంద్రబాబు


ఎంత ఇచ్చినా సరిపోదంటారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంటుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం ఎంత ఇచ్చినా మీకు తృప్తి ఉండదని వెంకయ్యనాయుడు ఆరోపిస్తుంటారని అన్నారు. దానికి సమాధానమిస్తూ, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుందని చెబుతుంటానని అన్నారు. ఏపీ అలాంటి కష్టాల్లో ఉందని తాను గుర్తు చేస్తుంటానని ఆయన తెలిపారు. వెంకయ్యనాయుడు ఎంపీగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా, జన్మభూమికి సేవ చేయాలని, రాష్ట్రానికి న్యాయం చేసేందుకు నిత్యం ప్రయత్నించాలని ఆయన సూచించారు. విభజన కారణంగా రాష్ట్రం నష్టపోయింది కనుక దానిని సరి చేసేందుకు ఆయన సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఆయన చేస్తున్న సహాయానికి మనస్పూర్తిగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.

  • Loading...

More Telugu News