: పాతబస్తీలో అగ్ని ప్రమాదం...మంటలార్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాదులోని పాతబస్తీ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూంలో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా వెలికి రాలేదు. కాగా, భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండడంతో పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.