: బండారం బయటపడడంతో భర్త నాలుక కోసి, దారుణానికి తెగబడిన భార్య!


ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మొరాదాబాద్ లోని సంబల్ కి చెందిన జితేంద్ర అనే యువకుడు కొన్నాళ్ల కిందట తన భార్య మీనాక్షితో కలిసి అక్కడికి వలస వచ్చాడు. వచ్చిన తరువాత ఇటుకబట్టీల్లో కూలీగా కుదురుకున్నాడు. దగ్గర్లోని ఓ ఇంట్లో అద్దెకుంటున్న జితేంద్ర ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చి, తన ఇంటి బెడ్ రూమ్ లో దృశ్యాన్ని చూసి షాక్ కు గురయ్యాడు. బెడ్ రూంలో ఇద్దరు పరపురుషులతో తన భార్య మీనాక్షి బాగా సన్నిహితంగా వుండడం కనిపించింది. దీంతో వారికి బుద్ధి చెప్పాలని భావించి, వారిపై దాడికి యత్నించాడు. అతను స్పందించేలోపు వారు ముగ్గరూ అతనిని బంధించారు. తన రహస్యం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు మీనాక్షి తన భర్త నాలుక కోసేసింది. తరువాత వారు ముగ్గురూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు బంధించడంతో ఎటూకదల్లేని జితేంద్ర రక్తపు మడుగులో పడి ఉండడాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి, అతనిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. దీంతో 9 కుట్లు వేసిన వైద్యులు అతని నాలుకను అతికారు. మీనాక్షికి వివాహానికి పూర్వమే పలువురితో సంబంధాలు ఉండేవని, వివాహానంతరం విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండడంతో ఉన్న ఊర్లో పరువు పోతోందని ఊరువదిలాడని, అక్కడ కూడా ఆమె ఏమాత్రం మారలేదని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News