: అండర్ వరల్డ్ డాన్ దావూద్ సోదరి జీవితకథతో సినిమా ప్రారంభం


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా సినిమా నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు షూటింగ్ ప్రారంభమైంది. అపూర్వ లఖియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హసీనా పాత్రలో శ్రద్ధా కపూర్, దావూద్ పాత్రలో శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ లు నటిస్తున్నారు. తన సోదరుడితో కలసి శ్రద్ధా నటించడం ఇదే తొలిసారి. హసీనా చిత్రం ప్రారంభమయిందన్న విషయాన్ని శ్రద్ధా కపూర్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

  • Loading...

More Telugu News