: నేనా?...రాష్ట్రపతా?...హహహ: అమితాబ్ బచ్చన్


బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తనను విష్ చేసేందుకు ముంబయ్ లోని తన నివాసం 'జల్సా'కు వచ్చిన అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పుట్టిన రోజు సందర్భంగా చేసే మూడు పనులు ఎందుకు చేస్తారో తనకి ఇప్పటికీ తెలియదని అన్నారు. ఎంత వయసు వచ్చినా ప్రతి పుట్టిన రోజుకు కేక్ తీసుకొస్తారని అన్నారు. ఇలా కేక్ ఎందుకు తీసుకొస్తారన్నది తనకు ఇంకా అంతుబట్టలేదని ఆయన చెప్పారు. అలాగే కేకు మీద కొవ్వొత్తి వెలిగిస్తారు, దానిని మళ్లీ ఆర్పేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు?... కేకును ముక్కలు కోస్తారు, అలా కోయడానికి కారణమేంటి? ఈ మధ్యే మరో సంప్రదాయం మొదలైంది. కేకును ముఖంపై పూయడం ఇలా ఎందుకు చేస్తారు? వంటి విషయాలు తనకు ఇంకా అంతుచిక్కనివని ఆయన చెప్పారు. పుట్టిన రోజును పురస్కరించుకుని కేకు కోయడం ఎప్పుడో మానేశానని ఆయన తెలిపారు. మరో రెండు రోజుల్లో సర్కార్ 3 సినిమా షూటింగ్ మొదలు కానుందని ఆయన ప్రకటించారు. షూటింగ్ మొదలయ్యాక కథ గురించి చెబుతానని ఆయన అన్నారు. అయితే గతంలో వచ్చిన సర్కార్ సినిమాల కంటే ఈ సినిమా బాగుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. శత్రుఘన్ సిన్హా రాష్ట్రపతిగా అమితాబ్ ను నియమించాలని డిమాండ్ చేయడం గురించి మాట్లాడుతూ, ఆయన సరదగా అలా అని ఉంటారని అన్నారు. గట్టిగా నవ్వేసిన ఆయన, అది జరిగే అవకాశం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News