: నటి శిల్పాశెట్టికి పితృవియోగం
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి కన్నుమూశారు. ముంబైలో ఉన్న ఆయన ఈ ఉదయం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కోకిలాబెన్ హాస్పిటల్ కు తరలించారు. సురేంద్రను బతికించడానికి డాక్టర్లు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. సురేంద్రకు భార్య సునంద, కుమార్తెలు శిల్ప, షమితలు ఉన్నారు. సురేంద్ర శెట్టి మంచి వ్యాపారవేత్తగా పేరు పొందారు. ట్యాంపర్ ప్రూఫ్ వాటర్ క్యాప్స్ తయారు చేసే వ్యాపారంలో ఆయన ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.