: అశ్విన్ ఖాతాలో రెండు వికెట్లు...కివీస్ 86/3


టీమిండియా తురుపుముక్క రవిచంద్రన్ అశ్విన్ మరోసారి జూలువిదిల్చాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడోటెస్టు రెండో ఇన్నింగ్స్ లో రాణించి, ఓటమిని తప్పించుకోవాలని న్యూజిలాండ్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తొలి ఇన్నింగ్స్ ను కుప్పకూల్చి కివీస్ పతనాన్ని శాసించిన అశ్విన్ మరోసారి తన ప్రతాపం చూపుతున్నాడు. ఈ క్రమంలో క్రీజులో కుదురుకున్న కివీస్ కెప్టెన్ విలియమ్సన్ (27)ను కీలక దశలో పెవిలియన్ పంపిన అశ్విన్, రాస్ టేలర్ (32) ను మరోసారి అవుట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి, ఓటమిని తప్పించుకునేందుకు ఎదురీదుతోంది. ఏదైనా అద్భుతం జరిగితే లేదా వరుణుడు అడ్డుపడితే తప్ప టీమిండియా విజయాన్ని అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. రెండు వికెట్లు అశ్విన్ తీయగా, ఒకటి రన్ అవుట్.

  • Loading...

More Telugu News