: శరణమా? రణమా?... గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగ్ అదుర్స్
"విశ్రాంతి లేదు... విరామం లేదు... నా కత్తికంటిన నెత్తురు ఇంకా పచ్చిగానే ఉంది... సమయం లేదు మిత్రమా... శరణమా? రణమా?"... 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో నందమూరి బాలకృష్ణ ఆవేశంగా చెప్పిన డైలాగ్ ఇది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజర్ ను దసరా సందర్భంగా నేడు విడుదల చేశారు. రాజకుమారుడి వేషంలో, కత్తి చేతబట్టి, రాజసం ఉట్టిపడేలా టీజర్ లో బాలయ్య కనిపించాడు. యుద్ధభూమిలో శత్రువులతో పోరాడుతున్న సన్నివేశాలు గల ఈ టీజర్ బాలయ్య అభిమానులను అలరిస్తోంది. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ఈ టీజర్ చెబుతోంది. సంక్రాంతి పండుగకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.