: సెంచరీతో చెలరేగిన పుజారా... 216 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఇండియా..కివీస్ టార్గెట్ 475 పరుగులు


న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టులో 216 పరుగుల వద్ద (3 వికెట్ల నష్టానికి) టీమిండియా డిక్లేర్ చేసింది. దీంతో, 475 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది భారత్. ఈ క్రమంలో టీమిండియా బ్యాట్స్ మెన్ పుజారా మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 148 బంతులను ఎదుర్కొన్న పుజారా 9 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో రహానే 23 పరుగులతో నాటౌగా నిలిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన న్యూజిలాండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ లాథమ్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఉమేష్ యాదవ్ వేసిన బంతికి లాథమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. గుప్తిల్, విలియం సన్ లు క్రీజులో ఉన్నారు. కివీస్ ప్రస్తుత స్కోరు వికెట్ నష్టానికి 9 పరుగులు.

  • Loading...

More Telugu News