: నిరాశపరిచిన కోహ్లీ... సెంచరీకి చేరువలో పుజారా
న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 211 పరుగుల భారీ స్కోరుతో అలరించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ... రెండో ఇన్నింగ్స్ లో నిరాశ పరిచాడు. కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో, 158 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం రహానే (1) క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్ లో పుజారా 81 పరుగులతో నిలకడగా తన ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నాడు. భారత్ ప్రస్తుత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 174 పరుగులు.