: కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నా: కేటీఆర్


సిరిసిల్ల జిల్లాను ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్ కృషితోనే తెలంగాణ ఏర్పడిందని... ఆయన చలవతోనే సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించిందని చెప్పారు. జిల్లాలు, మండలాలు చిన్నగా ఉంటే ప్రతి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో అధికారులకు తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. సిరిశాల కార్మికులు ఒకనాడు పనిచేసిన పట్టణం సిరిసిల్ల, వేములవాడ రాజన్న ఈ రెండు పేర్లు కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా అని నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News