: అమితాబ్ కోసం సన్నీలియోన్ స్పెషల్ వీడియో


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే అభిమానం ఉండని వారు ఎవరుంటారు? ట్విట్టర్ లో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్యను చూసినా ఈ విషయం అర్థమవుతుంది. బిగ్ బీని అభిమానించే వారిలో శృంగార తార సన్నీలియోన్ కూడా ఉంది. అమితాబ్ పై తన అభిమానాన్ని చాటుకోవడానికి, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ వీడియోను రూపొందించింది. తన పెంపుడు కుక్కతో కలసి రూపొందించిన ఈ వీడియోలో వైట్ టాప్, షార్ట్ జీన్స్ వేసుకుని కనిపించింది సన్నీ. ఈ వీడియోలో అమితాబ్ కోసం ఓ పాట పాడి... హ్యాపీ బర్త్ డే అమిత్ జీ అంటూ ముగించింది.

  • Loading...

More Telugu News