: కశ్మీర్ లో 250 మంది ఉగ్రవాదులు... సైన్యంపై దాడులే లక్ష్యం
కల్లోలిత కశ్మీర్ లోయలో దాదాపు 250 మంది పాక్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భారత ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. వీరిలో జైషే మెహమ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ మొజాహిదీన్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారని నివేదికలో ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికే వారంతా భారత్ లో ప్రవేశించారని... ఆర్మీపై దాడులే వారి లక్ష్యమని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో, భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉగ్రవాదులు దాడులకు తెగబడితే... సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరింది. మరోవైపు, దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దుకు అవతల వేచి ఉన్నట్టు... భారత్ లో ప్రవేశించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.