: తనపై మీడియాలో వచ్చిన కథనాలకు కడియం వివరణ


తెలుగుదేశం పార్టీని వీడతానంటూ తనపై మీడియాలో వచ్చిన కథనాలపై ఆ పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని, వాటిని ఖండిస్తున్నట్టు కడియం అన్నారు. నేడు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీని వీడి ఏ పార్టీలోనూ చేరబోవడంలేదని స్పష్టం చేశారు. ఇక టీడీపీ.. తెలంగాణ విషయంలో స్వతంత్రంగా పోరాడడం మంచిదని కడియం అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News