: హాస్టల్‌‌లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న సీఏ విద్యార్థి.. అరెస్ట్ చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు


హాస్టల్‌లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న సీఏ విద్యార్థిని హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 9 ల్యాప్‌టాప్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కొప్పెరపాలెం గ్రామానికి చెందిన కె.విజయకృష్ణ అలియాస్ విజయ్(24) సీఏ చదువుతూ మధ్యలోనే మానేశాడు. ఇటీవల నగరానికి వచ్చిన విజయ్ అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌లోని హాస్టళ్లలో ఉంటూ రూమ్మేట్స్ లేని సమయంలో వారి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు తీసుకుని పరారయ్యేవాడు. వాటిని అమ్మి జల్సాలు చేసుకునేవాడు. హాస్టళ్లలో విలువైన వస్తువులు చోరీలకు గురవుతున్నట్టు ఫిర్యాదులు వస్తుండడంతో దృష్టిసారించిన ఎస్సార్‌నగర్ క్రైం పోలీసులు ఆయా హాస్టళ్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా విజయకృష్ణను గుర్తించారు. సోమవారం ఓ షాపులో దొంగిలించిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వలవేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News