: హోదా కన్నా ప్యాకేజీ మేలని భావించే మొగ్గు చూపా.. స్పష్టం చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉందని భావించే దానికి మొగ్గుచూపినట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ హోదాకంటే ప్యాకేజీ వల్లే ఎక్కువ లాభాలు ఉన్నట్టు నమ్మి అటువైపు మొగ్గుచూపినట్టు వివరించారు. గోదావరిలో నీరు వృథా కాకుండా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేస్తామన్నారు. రాజకీయాలు చేసేవారు ఎక్కువకాలం మనుగడ సాగించలేరంటూ ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి ఎండగట్టారు.