: కారు బహుమతి అందుకుని.. 'థాంక్యూ డాడ్' అని చెప్పిన అల్లు శిరీష్!


ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తన రెండో కుమారుడు, సినీ నటుడు అల్లు శిరీష్‌ కు ఖరీదైన కానుక అందజేశారు. ఈ మధ్యే 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాతో విజయం అందుకున్న శిరీష్‌ కు 'ఆడీ క్యూ7' కారును తన పెద్ద కుమారుడితో కలిసి బహుమతిగా అందజేశారు. వారిద్దరూ తాళాలు అందిస్తున్న సందర్భంలో దిగిన ఫోటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసిన శిరీష్... ‘లవ్లీ గిఫ్ట్‌ ఇచ్చినందుకు థ్యాంక్యూ డాడ్‌. ఆడీ క్యూ7 నాకు ఇష్టమైన కారు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇది అల్లు అర్జున్, అల్లు శిరీష్ అభిమానులను అలరిస్తోంది.

  • Loading...

More Telugu News