: 37 ఏళ్లకే 100 మంది పిల్లలకు తండ్రయిన అమెరికన్!
బాలీవుడ్ సినిమా విక్కీ డోనర్ చూశారా... అందులో హీరో సంతాన భాగ్యంలేని వారికి వీర్య దానం చేసి సంతానం కలిగేలా చేస్తాడు. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో సుమంత్ హీరోగా వస్తోంది. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. మ్యాట్ స్టోన్ కేవలం 37 ఏళ్లకే 100 మంది పిల్లలకు తండ్రయ్యాడు. సుమారు పదేళ్లుగా వీర్యదానం చేస్తున్న మ్యాట్ స్టోన్ రోజూ పది మందితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. నాలుగేళ్ల క్రితం మ్యాట్ స్టోన్ 'షిప్పింగ్ డోనర్' అనే ఫేస్ బుక్ పేజ్ క్రియేట్ చేసి, ఆ పేజీ ద్వారా సంతానలేమితో బాధపడుతున్న వారికి వీర్యదానం చేస్తూ 100 మందికి తండ్రయ్యాడు.