: అఫ్రిదీపై మియాందాద్ 'దొంగ' కామెంట్లు!


పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్లు జావెద్ మియాందాద్, షాహిద్ అఫ్రిదీల మధ్య వివాదం ముదురుతోంది. గతంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యే సమయంలో, పీసీబీ తనకు వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం కల్పించకపోవడం బాధ కలిగించిందని అఫ్రిదీ వ్యాఖ్యానించాడు. అప్పట్లో అతనికి కౌంటర్ ఇస్తూ... డబ్బుల కోసమే అఫ్రిదీ చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడంటూ మియాందాద్ మండిపడ్డాడు. దీంతో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్రిదీ, మియాందాద్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ, 'మియాందాద్ గొప్ప క్రికెటర్. అయితే ఆయన ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తాడని ఊహించలేదు. అందుకే మియాందాద్ కు ఎంత ఆట తెలిసినా ఇమ్రాన్ ఖాన్ లాగా మంచి పేరు సంపాదించుకోలేకపోయాడు' అని సమాధానమిచ్చాడు. దీంతో అహం దెబ్బతిన్న మియాందాద్... అఫ్రిదీని తిట్టిపోశాడు. అఫ్రిదీని 'దొంగ కొడుకు' (Afridi is a son of a thief) అంటూ అభ్యంతరకరంగా సంభోదించాడు. అంతేకాకుండా కాసుల కోసం దేశాన్ని అమ్మేసిన దుర్మార్గుడు అంటూ అతనిపై విరుచుకుపడ్డాడు. ఓసారి మ్యాచ్ ఫిక్సింగ్ డబ్బులు తీసుకుంటూ తనకు రెడ్ హ్యాండెడ్ గా అఫ్రిదీ దొరికిపోయాడని చెప్పాడు. కావాలంటే అఫ్రిదీని అతని కూతురిపై ఒట్టేసి తాను చెప్పింది అబద్ధమని చెప్పమనండి అంటూ సవాల్ విసిరాడు.

  • Loading...

More Telugu News