: అందరూ 'హ్యుమన్ ఫొటోగ్రాఫిక్ బ్రెయిన్' అని పొగిడితే మా ఆవిడ మాత్రం 'యూస్ లెస్ బ్రెయిన్' అంటుంది!: వాపోయిన అమెరికన్ 'స్పెషల్' పోలీసు


అమెరికన్ పోలీసు వ్యవస్థ మొత్తం తనను 'హ్యుమన్ ఫొటోగ్రాఫిక్ బ్రెయిన్' అని పొగిడితే, ఒకే ఒక్క మహిళ మాత్రం తనది 'యూస్ లెస్ బ్రెయిన్' అని ఎద్దేవా చేస్తోందని వెస్ట్‌ ల్యాండ్‌ కి చెందిన ఆండీ పోప్‌ వాపోతున్నాడు. వెస్ట్ ల్యాండ్ కి చెందిన ఆండీ పోప్ 2008 నుంచి పోలీసుగా పని చేస్తున్నాడు. ఆండీ ఉద్యోగంలో చేరిన మొదట్లో కంప్యూటర్ ముందు కూర్చుని నేరస్థుల ఫోటోలు చూస్తూ ఉండేవాడు. దీనికి తోడు అతనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. దీంతో ఒకసారి పరీక్షగా చూసిన నేరస్థుడ్ని ఆండీ సులువుగా గుర్తించేస్తాడు. ఆ లక్షణం అతనికి వృత్తిలో అరుదైన గుర్తింపుని తెచ్చిపెట్టింది. రోడ్డు మీద నడుస్తూ ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ల ముఖాల్ని చూసి నిర్ధారించేసి అదుపులోకి తీసుకుంటాడు. దీంతో ఆయన పని చేసే పోలీస్ స్టేషన్ కి అతను ఒక ఆయుధంలా మారాడు. ఇలా గడిచిన నాలుగేళ్లలో సుమారు 850 మంది నేరస్థుల ముఖాల్ని గుర్తించుకొని డిపార్ట్‌ మెంట్‌ కి పని ఒత్తిడి తగ్గించాడు. దీంతో అతనిని పోలీసులు 'హ్యూమన్‌ ఫొటోగ్రఫిక్‌ బ్రెయిన్‌' అంటూ కీర్తిస్తున్నారు. డిపార్ట్ మెంట్ మొత్తం తనని అలా కీర్తిస్తుంటే, ఇంట్లో భార్య మాత్రం యూస్ లెస్ బ్రెయిన్ అని మండిపడుతుందని ఆండీ వాపోతున్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'నేరస్థులను గుర్తుంచుకొని పట్టుకోవటం నా వృత్తి. అదీ కాక నాకున్న జ్ఞాపక శక్తి వల్ల అది సులువవుతోంది. అయితే నా భార్య పుట్టినరోజు, వివిధ వేడుకల తేదీలను గుర్తుంచుకోమంటే మాత్రం సాధ్యం కావడం లేదు'. అందుకే ‘యూస్ లెస్‌ బ్రెయిన్‌’ అని మా ఆవిడ నాపై చిరాకు పడుతుంది' అన్నాడు పోప్. అందుకే 'ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే'నని పెద్దలన్నారు!

  • Loading...

More Telugu News