: నన్ను ‘కోమటి’ అంటూ మా పార్టీ నేతలే కామెంట్ చేస్తున్నారు!: వాపోయిన జానారెడ్డి
తనను ‘కోమటి’ అంటూ తమ పార్టీ కార్యకర్తలే అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం ఆవేదనకు గురిచేస్తోందని తెలంగాణ ప్రతిపక్ష నేత జానా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు ఈరోజు హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ సందర్భంలోనే జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తనను కోమటి అంటూ అభివర్ణిస్తున్నారని ఆయన అనడంతో, సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ‘కోమటి’ అంటూ తానేమీ అనలేదని అనడంతో సమస్య సద్దుమణిగింది.