: సర్జికల్ స్ట్రయిక్స్ కు ముందే భారత్ లోకి చొరబడ్డ 250 మంది ఉగ్రవాదులు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడానికి ముందే 250 మంది ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలోకి జొరబడ్డారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కర్-ఎ-తొయిబా, జైష్-ఎ-మహ్మద్ కు చెందిన ఈ ఉగ్రవాదుల్లో 107 మంది కశ్మీరీలు కాగా, 143 మంది పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు. ఈ 150 మంది ఉగ్రవాదులు భారత్ లో భారీ విధ్వంసం సృష్టించేందుకే నియంత్రణ రేఖ దాటి కశ్మీర్ లోయలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే అరెస్ట్ చేసిన కాశ్మీరీ, పాక్ ఉగ్రవాదుల ద్వారా వీరి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. వీలైనంత త్వరగా ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టకపోతే పెను ప్రమాదం తప్పదని తెలుస్తోంది.