: జ‌య‌ల‌లిత‌కు న్యూట్రిషిన్ సపోర్టుతో ఫిజియోథెరపీ చేస్తున్నాం: అపోలో వైద్యులు


గ‌తనెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఆమె ఆరోగ్యంపై ఆ ఆసుప‌త్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుద‌ల చేశారు. జ‌య‌ల‌లిత ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉందని, ఆమె కోలుకుంటున్నారని చెప్పారు. ‘అమ్మ‌’ చికిత్స‌కు సంబంధించి యాంటీ బ‌యాటిక్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యాన్ని 24 గంట‌లూ ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. జ‌య‌ల‌లిత‌కు న్యూట్రిషిన్ సపోర్టుతో ఫిజియోథెరపీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిమ్స్ డాక్ట‌ర్ జి.ఖిల్నామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌య‌ల‌లిత‌కు వైద్య ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News