: అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే
ఈ ఏడాదికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని బెంట్ హోమ్ స్ట్రామ్, ఒలివర్ హార్ట్ లు గెలుచుకున్నారు. కాంట్రాక్ట్ థియరీని రూపొందించినందుకు గాను వీరిని నోబెల్ బహుమతి వరించింది. వీరు రూపొందించిన సూత్రాలతో కాంట్రాక్టులను, వ్యవస్థలను అర్థం చేసుకోవడం సులువవుతుందని నోబెల్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. కంపెనీ సీఈఓలకు ఇచ్చే జీతాలను కూడా ఈ థియరీ ద్వారా అంచనా వేయవచ్చు. ఇన్స్యూరెన్స్ కోసం ఎంత కోత విధించవచ్చు? అనే విషయాన్ని కూడా ఈ సిద్ధాంతంతో కనుక్కోవచ్చు. కాంట్రాక్ట్ డిజైన్ లో ఉన్న లోపాలను కూడా ఈ సూత్రాలు ఎత్తిచూపుతాయని నోబెల్ బహుమతిని అందించే రాయల్ స్వీడిష్ అకాడమీ తెలిపింది.