: కాలునే ఎరవేసి అనకొండను పట్టాడు!


సాధారణంగా చేపలు పట్టడానికి ఎరవేస్తాం. జంతువును పట్టడానికి వేరే జంతువును ఎరగా వేస్తాం. కానీ, ఓ భారీ అనకొండను పట్టడానికి ఓ వ్యక్తి ఏకంగా తన కాలునే ఎరగా వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అనకొండను పట్టుకోవడానికి ఆ వ్యక్తి తన కుడి కాలు మోకాలు వరకు గుడ్డ చుట్టుకుని... ఎలాంటి భయం లేకుండా అనకొండ ఉన్న పెద్ద బొరియలోకి కాలు దుర్చాడు. కాసేపటి తర్వాత, అనకొండ అతని కాలును మింగడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని వెంటనే తనతో పాటు ఉన్న వాళ్లకు చెప్పడంతో... అతన్ని వారు నెమ్మదిగా బయటకు లాగారు. దీంతో, అతని కాలుతో పాటే 12 అడుగుల అనకొండ కూడా బయటకు వచ్చింది. వెంటనే ఓ పదునైన కత్తి సాయంతో అనకొండను చీల్చి అతని కాలును విడిపించారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటి మందికి పైగా చూశారు.

  • Loading...

More Telugu News