: ఇంత దిగజారుడు రాజకీయం ఎందుకు?: సోమిరెడ్డిపై మేకపాటి ధ్వజం
ఎవరిని సంతోషపెట్టేందుకు ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ పై వచ్చే ఆరోపణలకు సమాధానం చెప్పలేకే... జగన్ పై బురదజల్లే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలోనే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్యపు ఆరోపణలను ప్రజలు నమ్మరని తెలిపారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.