: నేనూ చూడలేదు... వైద్యులు చెబుతున్న ప్రకారం జయలలిత కోలుకుంటున్నారు: కిరణ్ బేడీ
ఈ మధ్యాహ్నం చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించేందుకు వచ్చిన పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ మీడియాతో మాట్లాడారు. తాను జయలలితను చూడలేదని, వైద్యులతో మాత్రమే మాట్లాడానని చెప్పారు. వైద్యులు చెబుతున్న ప్రకారం జయలలిత కోలుకుంటున్నారని, సాధ్యమైనంత త్వరగా ఆమెను మామూలు మనిషిని చేసేందుకు వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. బయట వస్తున్న ఎలాంటి వదంతులనూ నమ్మవద్దని అన్నారు.