: లక్షిత దాడులపై వీడియోలను బయటపెట్టాల్సిన అవసరం లేదు: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి


నియంత్రణ రేఖను దాటి భారత సైన్యం పీవోకేలో చేసిన దాడులపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి స్పందించారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సైన్యం జరిపిన ల‌క్షిత దాడుల వీడియో ఫుటేజీని బయటపెట్టాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీరుపై ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. రాజకీయ ప్ర‌యోజ‌నాల‌ కోసమే ఆయ‌న‌ పాదయాత్ర చేస్తున్నారని దివాక‌ర్‌రెడ్డి ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరును గుర్తించి సీల్డ్‌ కవర్లలో ర్యాంకింగులు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. త‌మ ప‌నితీరుకి ప్రజల తీర్పే సమాధానమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News