: ఆందోళనకరంగా థాయ్ రాజు ఆరోగ్యపరిస్థితి.. డయాలసిస్ చేస్తున్న వైద్యులు


థాయ్ లాండ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రక్తపోటు పడిపోవడం, మూత్ర పిండాలు పనిచేయకపోవడంతో ఆయనకు డయాలసిస్ చేయనున్నట్లు రాజభవనం అధికారులు, వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్ ఆధారంగా శ్వాస తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇన్ ఫెక్షన్ నుంచి కోలుకుంటున్నారని పేర్కొన్నారు. థాయ్ లాండ్ హౌస్ హోల్డ్ బ్యూరో ఈ మేరకు భూమిబోల్ అదుల్యతేజ్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.

  • Loading...

More Telugu News